మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 1 ఎంతటి సంచనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే! గతేడాది సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ..సముద్రంలో జరిగే ఫైట్ సీన్‌తో మొదలైంది. వారసుడు అయిన ‘అరుల్‌మొళి వర్మన్ (జయం రవి)’ చనిపోయాడనుకుని చోళ రాజ్యాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజు ‘అరుల్‌మొళి వర్మన్’ చనిపోయాడని వార్త అందుకున్న పాండ్యులు ‘ఆదిత్య కరికాలుడు (విక్రమ్)’ని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు. ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ ట్రైలర్ మూవీ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment