హరీష్ శంకర్, చైతు, రవిశంకర్
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది.
ఈ చిత్రం ట్రైలర్‌ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్‌గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్.
ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment