నవతరంలో ప్రతిభ దాగి ఉంది | Puri Jagannadh Released Mayam Movie Trailer | Sakshi
Sakshi News home page

నవతరంలో ప్రతిభ దాగి ఉంది

Published Sat, Dec 29 2018 12:26 AM | Last Updated on Sat, Dec 29 2018 12:26 AM

Puri Jagannadh Released Mayam Movie Trailer - Sakshi

అజయ్‌ కతువార్‌, పూరి జగన్నాథ్‌

‘‘నవతరంలో బోలెడంత ప్రతిభ దాగి ఉంది. ‘మెహబూబా’తో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన అజయ్‌ హీరోగా నిరూపించుకునేందుకు హార్డ్‌వర్క్‌ చేస్తున్నాడు. తను పెద్ద స్థాయికి ఎదగాలి. ‘మాయం’ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ప్యాషనేట్‌గా తెరకెక్కించారనిపిస్తోంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. అజయ్‌ కతువార్‌ హీరోగా నటించిన చిత్రం ‘మాయం’. ఇషితా షా కథానాయిక. నిషాంత్‌ దర్శకుడు. జయశ్రీ  రాచకొండ, లక్ష్మీ హుసేన్, సందీప్‌ బోరెడ్డి ముఖ్య తారలుగా ధీమాహి ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.ఏ.రాజు  నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని పూరి జగన్నాథ్‌ ఆవిష్కరించారు. అజయ్‌ కతువార్‌ మాట్లాడుతూ– ‘‘పూరి సార్‌ ప్రోత్సాహంతో ‘మెహబూబా’లో నటించాను. ఇంతకుముందు హాలీవుడ్‌లోనూ నటించాను. నేను నటించిన ‘ది ఇండియన్‌ పోస్ట్‌మేన్‌’ మూడేళ్ల క్రితం 8 దేశాల్లో వివిధ సినిమా పండగల్లో ప్రదర్శనకు పంపగా మూడు దేశాల్లో నామినేట్‌ అయ్యింది. ‘స్పైసెస్‌ ఆఫ్‌ లిబర్టీ’ అనే చిత్రం అమెరికాలో థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యింది. నేను నటించిన మరో చిత్రం ‘ప్రేమదేశం’ కూడా త్వరలో రిలీజ్‌ కానుంది’’ అన్నారు. ‘‘ఇదొక డిఫరెంట్‌ మూవీ’’ అన్నారు నిషాంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement