Watch: Varun Dhawan And Kritisanan Bhedia Movie Trailer Out Today, Goes Viral - Sakshi
Sakshi News home page

Bhedia Trailer Out: పగలు మనిషి.. రాత్రి తోడేలు.. ఆసక్తికరంగా భేడియా ట్రైలర్

Published Wed, Oct 19 2022 7:05 PM | Last Updated on Wed, Oct 19 2022 7:38 PM

Varun Dhawan And Kritisanan Movie Bhedia Trailer Out Today - Sakshi

వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ చిత్రం 'భేడియా'. తాజాగా చిత్రబృందం ఇవాళ ట్రైలర్‌ విడుదల చేసింది.. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్‌ కౌశిక్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా'. 

ట్రైలర్ చూస్తే.. 'తోడేలుగా మారిన వరుణ్ ధావన్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. తోడేలుగా మారాక అతని జీవితం తలకిందులవుతుంది పగలు సాధారణ మనిషిలా కనిపిస్తూ రాత్రి వేళల్లో తోడేలుగా మారడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో అతని స్నేహితులు డాక్టర్ కృతి సనన్ వద్దకు తీసుకొస్తారు. అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 వరుణ్ తదుపరి చిత్రం ఎక్కిస్, సాజిద్ నడియాడ్‌వాలా సాంకిలో కనిపించనున్నాడు. అతను రాజ్,డీకే దర్శకులుగా తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్‌లో కనిపించనున్నారు. కృతి సనన్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి ఆదిపురుష్‌లో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు విమర్శలకు కూడా గురైంది. అయితే ఈ సినిమాలో కృతి లుక్‌ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement