నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో | Tiger Shroff About His First Girlfriend at 25, Varun Dhawan Asks If It was Kriti Sanon | Sakshi
Sakshi News home page

Tiger Shroff: ఆదిపురుష్‌ హీరోయిన్‌తో లవ్‌? స్టేజీమీదే అడిగేసిన హీరో

Published Thu, Mar 21 2024 1:12 PM | Last Updated on Thu, Mar 21 2024 1:55 PM

Tiger Shroff About His First Girlfriend at 25, Varun Dhawan Asks If It was Kriti Sanon - Sakshi

యాక్షన్‌ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్‌ ష్రాఫ్‌. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్‌ మూవీలో నటిస్తున్నాడు. టైగర్‌ ష్రాఫ్‌తో పాటు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్‌ సినిమా రంజాన్‌కు రిలీజ్‌ కానుంది. ఇకపోతే టైగర్‌ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 

25 ఏళ్ల వయసులో లవ్‌..
ఈ మూవీ థియేటర్‌లో రిలీజైన తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ గ్రాండ్‌ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్‌పై జోకులు పేల్చాడు హీరో వరుణ్‌ ధావన్‌. ముందుగా యాక్షన్‌ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్‌. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్‌ఫ్రెండ్‌ కూడా లేదు అని చెప్పాడు.

ఫస్ట్‌ లవ్‌.. ఆమె కాదా?
అయితే వరుణ్‌ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్‌ మూవీ హీరోయిన్‌ కృతి సనన్‌నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్‌.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్‌.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోకండి అని చెప్పాడు.

దిశాతో డేటింగ్‌- బ్రేకప్‌
కాగా టైగర్‌ ష్రాఫ్‌- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్‌ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్‌లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్‌పై ధనుష్‌ కామెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement