Watch: Varun Dhawan Bhediya Movie Chilipi Varaale Ivvu Lyrical Song Video Out - Sakshi
Sakshi News home page

Thodelu Movie: 'చిలిపి వరాలే ఇవ్వు'మని అంటోన్న వరుణ్‌ ధావన్‌

Published Mon, Nov 7 2022 5:54 PM | Last Updated on Mon, Nov 7 2022 7:09 PM

Bhediya: Chilipi Varaale Ivvu Song Out Now - Sakshi

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" సంస్థ ఇటీవలే కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. తాజాగా బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో  మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేదియా". ఈ చిత్రం నుంచి 'తుమ్కేశ్వరి' అనే మొదటి పాట ఇటీవల విడుదలవగా దీనికి విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపి వరాలే ఇవ్వు  పాటను కార్తీక్ ఆలపించారు. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన భేదియా హిందీ, తమిళం, తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా "భేదియా"ను 'తోడేలు' పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు.

చదవండి: కారు ప్రమాదం తర్వాత రంభ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా?

కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్‌ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement