కథ బాగుంటేనే ఆదరిస్తారు | 24Kisses Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

కథ బాగుంటేనే ఆదరిస్తారు

Oct 26 2018 2:48 AM | Updated on Oct 26 2018 2:48 AM

24Kisses Movie Trailer Launch - Sakshi

నరేష్, అయోధ్యకుమార్, హెబ్బా పటేల్, అరుణ్‌ అదిత్, అనిల్‌

‘‘24 కిస్సెస్‌’ సినిమా గురించి నరేష్‌గారు చెప్పేశారు. రావురమేష్‌గారు కానీ, సీనియర్‌ నరేష్‌గారు కానీ  ఏదన్నా సినిమా ఒప్పుకుని చేశారంటే అవి విషయం లేని సినిమాలు మాత్రం కాదు’’ అని దర్శకుడు అయోధ్య కుమార్‌ అన్నారు. అదిత్‌ అరుణ్, హెబ్బాపటేల్‌ జంటగా సిల్లీ మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో అనీల్, సంజయ్‌ నిర్మించిన చిత్రం ‘24 కిస్సెస్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. అయోధ్య కుమార్‌ మాట్లాడుతూ–‘‘ముద్దు ఇవ్వడమనేది గొప్పకాదు.. ముద్దుకు ముందు, తర్వాత ఇవ్వాల్సిన ఎమోషన్స్‌ పండటం చాలా అవసరం.

ఈ సినిమాలో ముద్దులు ఉన్నాయని ప్రేక్షకులు సినిమాకి రారు. కథ బాగుంటే తప్పకుండా ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘ముద్దు అనగానే ప్రతిఒక్కరూ తప్పుగానే ఆలోచిస్తారు. రొమాన్స్‌ అన్నది పూర్వకాలం నుంచే మొదలైంది. అందమైన ప్రేమ కావ్యం ‘24 కిస్సెస్‌’. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటుడు నరేష్‌. ‘‘బ్యానర్‌కి తగ్గట్టుగా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నరేష్‌గారు, రావు రమేష్‌గారు రెండు పిల్లర్లు. వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు అదిత్‌ అరుణ్‌. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు హెబ్బాపటేల్‌. నటి కీర్తన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement