Ayodhya kumar
-
మార్పులు చేశాం – అయోధ్యకుమార్
‘‘సినిమా ప్రమోషన్, పబ్లిసిటీ కోసం తప్పుదోవ పట్టలేదు. అసభ్యకరమైన సినిమాలు తీసి లబ్ధి పొందాలనుకునే ఫిల్మ్‌మేకర్‌ని కాను. ‘24 కిస్సెస్’ సినిమాను మా మదర్‌తో కలిసి చూశాను. కొందరు మహిళా మండలి సభ్యులు కూడా చూశారు. ఈ చిత్రం నా జీవితం ఆధారంగా తీసింది కాదు’’ అన్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా సీనియర్ నరేశ్, రావు రమేష్ కీలక పాత్రలు చేసిన చిత్రం ‘24 కిస్సెస్’. అయోధ్యకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. మంగళవారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆడియన్స్ రిపోర్ట్స్, కలెక్షన్స్ బాగున్నాయి. సినిమా అందరికీ నచ్చిందని చెప్పడం లేదు. రివ్యూస్ చదివాను. మల్టీఫుల్ లేయర్స్, స్లో నెరేషన్ ఉంది అంటున్నారు. నేనింతే మారను అనుకునేవాడినికాదు. పాజిటివ్ విషయాలను తీసుకున్నాను. ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి క్యూబ్‌లో పెట్టాం. చైల్డ్ యాక్టివిస్ట్‌కి చెందిన అందమైన ప్రేమకథా చిత్రం ఇది. ‘24కిస్సెస్’ కాన్సెప్ట్ ఏంటో సినిమా చూసినవారికి అర్థం అయ్యుంటుంది’’ అన్నారు. ‘‘ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువతరం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓ మంచి పాయింట్‌తో అయోధ్య కుమార్ మంచి లవ్‌స్టోరీ తీశారు. ఒక సినిమా రెవెన్యూనే సక్సెస్ అనుకుంటే ఈ సినిమా సక్సెస్ అయినట్లే. ఓ చైల్డ్ యాక్టివిస్ట్ ట్రావెలింగ్ లవ్‌స్టోరీని కిస్సెస్ల రూపంలో చూపించారు దర్శకులు’’ అన్నారు నరేశ్. ఈ సినిమాలో నటించిన శ్రీనివాస్ మాట్లాడారు. -
ఇది బూతు సినిమా కాదు
‘‘24 కిస్సెస్ అనగానే చాలా మంది బూతు సినిమా అనుకుంటున్నారు. కానే కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న అందమైన ప్రేమకథ’’ అన్నారు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా అయోధ్యకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘24 కిస్సెస్’. సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్ మూవీ రాదు. ‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్‌స్టోరీ 24 కిస్సెస్. ఇందులో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. ‘‘సినిమా రిలీజ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఎగై్జట్‌మెంట్‌తో పాటు నెర్వస్‌గా ఉంది. మంచి రిజల్ట్ వస్తుందన్న నమ్మకం ఉంది’’అన్నారు హెబ్బా పటేల్. ‘‘రిలీజైన ట్రైలర్‌కి, సాంగ్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. మర్చిపోలేని ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అరుణ్. -
కథ బాగుంటేనే ఆదరిస్తారు
‘‘24 కిస్సెస్’ సినిమా గురించి నరేష్‌గారు చెప్పేశారు. రావురమేష్‌గారు కానీ, సీనియర్ నరేష్‌గారు కానీ ఏదన్నా సినిమా ఒప్పుకుని చేశారంటే అవి విషయం లేని సినిమాలు మాత్రం కాదు’’ అని దర్శకుడు అయోధ్య కుమార్ అన్నారు. అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అనీల్, సంజయ్ నిర్మించిన చిత్రం ‘24 కిస్సెస్’. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. అయోధ్య కుమార్ మాట్లాడుతూ–‘‘ముద్దు ఇవ్వడమనేది గొప్పకాదు.. ముద్దుకు ముందు, తర్వాత ఇవ్వాల్సిన ఎమోషన్స్ పండటం చాలా అవసరం. ఈ సినిమాలో ముద్దులు ఉన్నాయని ప్రేక్షకులు సినిమాకి రారు. కథ బాగుంటే తప్పకుండా ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘ముద్దు అనగానే ప్రతిఒక్కరూ తప్పుగానే ఆలోచిస్తారు. రొమాన్స్ అన్నది పూర్వకాలం నుంచే మొదలైంది. అందమైన ప్రేమ కావ్యం ‘24 కిస్సెస్’. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటుడు నరేష్. ‘‘బ్యానర్‌కి తగ్గట్టుగా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నరేష్‌గారు, రావు రమేష్‌గారు రెండు పిల్లర్లు. వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు హెబ్బాపటేల్. నటి కీర్తన పాల్గొన్నారు. -
నా స్థాయిని మరచి కిందకి దిగను
‘మిణుగురులు’ వంటి చిత్రం తర్వాత అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రెస్పెక్ట్ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్ కంబైన్స్ పతాకంపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. డైరెక్టర్ అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్’ సినిమాని గతంలో వేరే నిర్మాతలతో స్టార్ట్ చేశా. అయితే.. నా క్రియేటివిటీ విషయంలో వారి వద్ద నాకు అంత ఫ్రీడమ్ దొరకలేదు. అందుకే సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాలగార్లతో ఈ చిత్రం తీశా. వీరు ఎక్కడా కల్పించుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘మిణుగురులు’ వంటి సినిమా తీసిన అయోధ్యకుమార్ ‘24 కిస్సెస్’ లాంటి సినిమా తీయడమేంటి? అంటున్నారు. నేనెప్పుడూ నా స్థాయిని మరచి కిందకి దిగను. అలా అనుకుని ఉంటే ‘మిణుగురులు’ తర్వాత చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఇదొక అందమైన ప్రేమకథ. చక్కని భావోద్వేగాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘తుంగభద్ర’ పాటల వేడుకలో నువ్వు లవ్‌స్టోరీస్ చేయొచ్చుకదా? అని నానిగారు అన్నారు. రెగ్యులర్ ప్రేమకథలకి భిన్నంగా ఓ చిత్రం చేయాలనుకున్నా. అది ‘24 కిస్సెస్’తో తీరింది’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘సింపుల్ ప్రేమకథా చిత్రమిది. మంచి చిత్రంలో అవకాశమిచ్చిన అయోధ్యకుమార్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు హెబ్బా పటేల్. ‘‘అయోధ్యగారు రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’’ అన్నారు సంజయ్‌రెడ్డి. మరో నిర్మాత అనిల్ పల్లాల, నటీనటులు అదితీ మ్యాకల్, అన్షు, మధు, కీర్తన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ గురల్లా, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
మిణుగురులుతో నా లక్ష్యం నెరవేరింది
కొన్ని సినిమాలు మనసుని తాకుతాయి. అంతకుముందు ఎన్నడూ కలగని ఓ రకమైన ఫీల్‌ని కలుగజేస్తాయి. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా వెంటాడతాయి. ‘మిణుగురులు’ ఈ కోవకి చెందిన సినిమానే. వసతి గృహాల్లో ఉండే అంథ బాల, బాలికల అవస్థలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత ఆయోధ్యకుమార్తో జరిపిన సంభాషణ... మొదటి సినిమా అంటే ‘సేఫ్’గా ఏ లవ్స్టోరీయో తీస్తుంటారు. కానీ, మీరు మొదటి ప్రయత్నంలోనే పెద్ద రిస్క్ తీసుకున్నారెందుకని? మీరన్నట్లు ‘మిణుగురులు’ చాలా రిస్కీ ప్రాజెక్ట్. నా మొదటి సినిమాకి జాతీయ, అంతర్జాతీయంగా మంచి స్కోప్ ఉన్న కథాంశం అయితే బాగుంటుందనుకుని ఈ సినిమా చేశాను. నా లక్ష్యం నెరవేరింది. అదే నేను ఏ లవ్స్టోరీయో, రొమాంటిక్ కామెడీ మూవీయో చేసి ఉంటే, ఇంత రీచ్ ఉండేది కాదు. ఆ మధ్య బెంగళూరులో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ ఇండియన్ సినిమా’ అవార్డ్ వచ్చింది. ఇంకా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ సినిమా ఎంపికైంది. సినిమాని చూసిన ప్రతిఒక్కరూ హార్ట్ టచింగ్ అంటున్నారు. అసలు మీ బ్యాగ్రౌండ్ ఏంటి? మెరైన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ జాబ్ నిమిత్తం యూఎస్ వెళ్లాను. అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. యూఎస్‌లోనే కొన్ని టెలీఫిల్మ్స్ తీశాను. టీబీఎస్ చానల్లో పని చేశాను. ఓ తెలుగువాడిగా తెలుగు సినిమాలు తీయాలనే తపనతో ఇక్కడికొచ్చేశాను. సినిమాల మీద ఆసక్తి ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? మా నాన్నగారు డ్రామాల్లో యాక్ట్ చేసేవారు. నాక్కూడా క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టం. టెన్త్ చదువుతున్నప్పుడు డెరైక్టర్ అవ్వాలనే కోరిక బలపడింది. అందుకే, యూఎస్‌లో ఫిలిం కోర్స్ చేశాను. వసతి గృహాలు ఎలాంటి దయనీయ స్థితిలో ఉంటాయో ‘మిణుగురులు’లో చూపించారు. అలా ఉంటాయని మీకెలా తెలుసు? ఈ కథ అనుకున్న తర్వాత నేను చాలా బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. వాటిల్లో ఎక్కువ శాతం హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకు, ఈ సినిమాలో పై అంతస్తులో ఉన్న బాత్రూమ్ నుంచి కారే నీళ్లు పిల్లలు అన్నం తినే ప్లేట్స్‌లో పడుతుంటాయి కదా. ఓ స్కూల్లో అచ్చం అలానే జరిగింది. అలాగే వార్డెన్ చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు కదా. ఇలాంటివన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా చూపించినవే. ఈ చిన్న సినిమాకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? సుహాసిన్, ఆశిష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్‌లు సీనియర్ ఆర్టిస్టులు. ఇది ప్రయోజనాత్మక చిత్రం కాబట్టి వాళ్లు పారితోషికం కొంత తగ్గించుకున్నారు. కానీ, సినిమా క్వాలిటీగా ఉండాలని ముంబయ్‌లోని స్టూడియోలో సౌండ్ డిజైన్ చేశాం. అమెరికా నుంచి కొంతమంది టెక్నీషియన్లు వచ్చారు. హాస్టల్ సెట్ వేశాం. షూటింగ్‌కే 90 రోజులు పట్టింది. సినిమా విడుదలకు ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా? ఈ విషయంలో దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన ఈ సినిమా చూసి, విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన వల్లనే ఈ సినిమాకు మంచి థియేటర్లు దొరికాయి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలొస్తాయి. -
దాసరి సమర్పణలో మిణుగురులు
‘‘నా సొంతచిత్రాలకు తప్ప, ఇంతవరకూ బయటి చిత్రాలకు సమర్పకునిగా నా పేరు వేసుకోలేదు. కానీ ‘మిణుగురులు’ సినిమా చూశాక నావంతుగా ఏదైనా చేయాలనిపించింది. అందుకే మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నాం. ఇందులో హృదయాన్ని స్పృశించే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప సినిమా ఇది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. 48 మంది అంధ బాలలతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మిణుగురులు’. అయోధ్య కుమార్ మాట్లాడుతూ -‘‘దాసరిగారు ముందుకు రాబట్టే నా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం వెనుక చాలామంది కష్టం ఉంది’’ అన్నారు.