
దాసరి సమర్పణలో మిణుగురులు
‘‘నా సొంతచిత్రాలకు తప్ప, ఇంతవరకూ బయటి చిత్రాలకు సమర్పకునిగా నా పేరు వేసుకోలేదు. కానీ ‘మిణుగురులు’ సినిమా చూశాక నావంతుగా ఏదైనా చేయాలనిపించింది. అందుకే మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నాం. ఇందులో హృదయాన్ని స్పృశించే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప సినిమా ఇది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. 48 మంది అంధ బాలలతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మిణుగురులు’. అయోధ్య కుమార్ మాట్లాడుతూ -‘‘దాసరిగారు ముందుకు రాబట్టే నా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం వెనుక చాలామంది కష్టం ఉంది’’ అన్నారు.