వినోదం... పోరాటం | Raghu Thatha trailer: Keerthy Suresh starrer promises a hilarious film this Independence Day | Sakshi
Sakshi News home page

వినోదం... పోరాటం

Published Thu, Aug 1 2024 2:53 AM | Last Updated on Thu, Aug 1 2024 2:53 AM

Raghu Thatha trailer: Keerthy Suresh starrer promises a hilarious film this Independence Day

కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రఘుతాత’. సుమన్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హోంబలే ఫిలింస్‌ తమ బేనర్‌పై నిర్మించిన ఈ తొలి తమిళ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను రిలీజ్‌  చేశారు.

‘ఒక అమ్మాయిలా నువ్వు ఎందుకు డ్రెస్సింగ్‌ చేసుకోవు?’, ‘ఒక అచ్చమైన అమ్మాయిలా ఉండేందుకు నాకు ఆసక్తి లేదు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఓ భాష నేర్చుకోవడానికి ఓ యువతి పడే ఇబ్బందులు, ఆమె ముందు ఉన్న సవాళ్లు, ఆమె పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement