
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అఖిల్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ ట్రైలర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రెస్ మీట్‌లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఇది రెండేళ్ల జర్నీలో ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయా. అయితే సినిమాకు ఏం కావాలో అది చేశానన్న ఆనందం ఉంది. ఈ సినిమాతో మానసికంగా దృఢంగా మారిపోయా. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్‌లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్‌తో నటించడం నా అదృష్టం. ఆయన విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. అందుకే కథ చెప్పగానే కమిట్ అయిపోయా' అని అన్నారు.
కాగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
Let's begin the #AGENT ACTION HEAT to beat the summer wave!!#AgentTrailer out on APRIL 18th
— SurenderReddy (@DirSurender) April 15, 2023
Stay Excited for the Massive Launch..#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @AnilSunkara1 @AKentsOfficial @LahariMusic @shreyasgroup pic.twitter.com/wpsJirNUFK