
‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్యా రాజేష్. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఐశ్వర్య చాలెంజ్’. కె.ఎ. సూర్యనిధి దర్శకత్వంలో పద్మశ్రీ డా. కూటికుప్పల సూర్యారావు సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ బ్లెసింగ్స్‌తో విడుదల చేశారు. చిత్రనిర్మాణ, నిర్వాహకుడు వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చిత్రీకరణ అంతా మలేసియాలో జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఇచ్చిన రామసత్యనారాయణగారికి రుణపడి ఉంటాను. సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజిగారు ఈ చిత్రానికి మాటలు రాశారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో థియేటర్లలోనే విడుదల చేస్తాం’’ అన్నారు.