![Saindhav Trailer Launch - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/Saindhav-%282%29.jpg.webp?itok=6ITUgIMr)
వెంకటేశ్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి
‘‘సైంధవ్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ (ప్రేక్షకులు, అభిమానులు) అందరి ప్రేమ, అభిమానం, ్ర΄ోత్సాహం కావాలి. నా కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘సైంధవ్’.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాశ్ కీలక ΄ాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సైంధవ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘సైంధవ్’తో అది నెరవేరింది. ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది.
నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి అసలైన ట్రీట్. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నేను చేయడం నా అదృష్టం. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా ఈ సినిమా కోసం వాడేశా. ఈ పండక్కి మా సినిమా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేయడం నా కల నెరవేరినట్లయింది. మా సినిమా విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి.
Comments
Please login to add a commentAdd a comment