Shraddha Srikanth
-
సంక్రాంతికి సైంధవ్ అసలైన ట్రీట్
‘‘సైంధవ్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ (ప్రేక్షకులు, అభిమానులు) అందరి ప్రేమ, అభిమానం, ్ర΄ోత్సాహం కావాలి. నా కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాశ్ కీలక ΄ాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సైంధవ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘సైంధవ్’తో అది నెరవేరింది. ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి అసలైన ట్రీట్. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నేను చేయడం నా అదృష్టం. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా ఈ సినిమా కోసం వాడేశా. ఈ పండక్కి మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేయడం నా కల నెరవేరినట్లయింది. మా సినిమా విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
కోలీవుడ్‌కు శ్రద్ధా శ్రీకాంత్
మలయాళం, కన్నడం వంటి ఇతర భాషల్లో ఒక్క చిత్రం హిట్ అయితే చాలు ఆ చిత్ర కథానాయికలకు తమిళంలో అవకాశాలు ఖాయం అని చెప్పవచ్చు. నటి సమంత రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు ప్రచారంలో ఉన్న కన్నడంలో మంచి విజయం సాధించిన యూటర్న్ చిత్ర నాయకి శ్రద్ధా శ్రీకాంత్‌కు అప్పుడే కోలీవుడ్‌లో కాలింగ్ వచ్చేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రం ఫేమ్ నివీన్ పౌలీ తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో శ్రద్ధా శ్రీకాంత్ హీరోయిన్గా దిగుమతి అవుతున్నారు.ఈ చిత్రానికి నవ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ మోగాఫోన్ పడుతున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న శ్రద్ధాశ్రీకాంత్ తన గురించి తెలుపుతూ తను తండ్రి ఆర్మీ అధికారి అన్నారు. దీంతో తన కుటుంబం దేశంలోని పలు ప్రాంతాలు తిరగాల్సిన పరిస్థితి అన్నారు. ఆ కారణంగా తనకు పలు సంస్కృతులకు చెందిన వారితో కలిసి మెలిసి జీవించిన అనుభవం కలిగిందన్నారు.వారి సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇక తమది విద్యావంతుల కుటుంబం అని తెలిపారు. తాను లా చదివి న్యాయవాదిగా పని చేశానని చెప్పారు. ఇది తన జీవితంలో ఒక భాగం అయితే నటనపై అసక్తి అన్నది చిన్నతనం నుంచి ఉందన్నారు. అది మోహంగా మారడంతో స్టేజీ ఆర్టిస్ట్‌గా నటనలో మెలికలు నేర్చుకున్నానన్నారు. పలు స్టేజీ ప్రొగ్రాంలలో పాల్గొన్న తనకు యూటర్న్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని వివరించారు. ఆ చిత్రంలో తన నటనకు పలువురి ప్రశంసలు లభించాయన్నారు. తాజాగా గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమిళ సినిమాలన్నా, తమిళ ప్రజలన్నా తనకు చాలా గౌరవమని అన్నారు. ఇక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాననే నమమకం ఉందని అంటున్నారు శ్రద్ధా శ్రీకాంత్.