
చింగ్, పూర్విటక్కర్
చింగ్ హీరోగా, పూర్విటక్కర్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓన్లీ నేను ... బట్ నాట్ ఎలోన్’. సర్కడమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సర్కడమ్ స్టోరీస్ బ్యానర్‌పై శేషగిరిరావు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శరకడం శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘నేను వ్యాపారవేత్తని. కొంతమంది పెద్దవాళ్ల సలహా మేరకు సర్కడమ్ స్టోరీస్ అనే బ్యానర్ పెట్టాను. ప్రపంచం మొత్తంలో టాప్‌టెన్ బిలియనీర్స్‌లో మహిళలు లేరు. ఈ అంశంపైనే ఈ చిత్ర కథ సాగుతుంది. నేనెందుకు పదిమందిలో ఒక్కరిగా ఉండకూడదు అనే లక్ష్యం ఆ అమ్మాయిది. అందులో భాగంగానే సొంత స్నేహితురాలిని సైతం చంపడానికి వెనకాడదు’’ అన్నారు.
‘‘మా సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సర్కడమ్ శ్రీనివాస్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. డిసెంబర్ 6కి ఈ చిత్రం పూర్తవుతుంది’’ అన్నారు శేషగిరిరావు. ‘‘నేను లాయర్‌ని. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు చింగ్. ‘‘ఈ సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు పూర్వి టక్కర్. ‘‘గతంలో నేను ‘జెనీలియా కథ’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాను. తర్వాత నాకు తమిళ్‌లో ఆఫర్స్ వస్తే వెళ్లాను. ఇప్పుడు తిరిగి తెలుగు ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు బాలచందర్ అన్నారు.