ప్రేక్షకులను నిరాశపరచదు | Bilalpur Police Station 2018 Movie Official Trailer | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులను నిరాశపరచదు

Published Mon, Dec 3 2018 5:50 AM | Last Updated on Mon, Dec 3 2018 5:50 AM

Bilalpur Police Station 2018 Movie Official Trailer - Sakshi

శ్రీనివాస్, శ్రీనాథ్, సాన్వీ, ఎన్‌. శంకర్, నాగసాయి

‘‘వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్‌ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశప రచదు’’ అని డైరెక్టర్‌ ఎన్‌. శంకర్‌ అన్నారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా గోరేటి వెంకన్న కీలక పాత్రలో నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’. 

మహంకాళి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఎన్‌.శంకర్‌ విడుదల చేశారు. మహంకాళి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. ఈ నెల రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక ఊరిలోని పోలీస్‌ స్టేషన్‌కు ఎలాంటి వింత కేసులు వస్తాయన్నదే ఈ చిత్ర కథాంశం. సరదాగా, సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నాగసాయి మాకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement