ఆసక్తికరంగా ‘హలో మీరా’ ట్రైలర్‌ | Director VV Vinayak Unveiled Trailer of Hello Meera Film | Sakshi
Sakshi News home page

Hello Meera : ఆసక్తికరంగా ‘హలో మీరా’ ట్రైలర్‌

Published Sat, Nov 5 2022 10:36 AM | Last Updated on Sat, Nov 5 2022 10:37 AM

Director VV Vinayak Unveiled Trailer of Hello Meera Film - Sakshi

గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ట్రైలర్‌ను డైరెక్టర్‌ వివి వినాయక్‌ లాంచ్‌ చేస్తూ ఈ సినిమా బిగ్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. 

2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్.    

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ  చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement