
ఎం.ఎస్. చౌదరి, విజయేంద్ర ప్రసాద్
నటుడు ఎం.ఎస్ చౌదరి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆది గురువు అమ్మ’. ‘సురభి’ ప్రభావతి, వేమూరి శశి, గోపరాజు విజయ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘దైవసమానులుగా భావించే తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆమె తొలి గురువుగా బిడ్డకు అన్నీ నేర్పిస్తుంది. అలాంటి అమ్మపై రూపొందిన ‘ఆది గురువు అమ్మ’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్‌గారికి «ధ్యాంక్స్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు ఎం.ఎస్. చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment