ఆకట్టుకుంటున్న 'స్వాతి ముత్యం' ట్రైలర్ | Swathymutyam Trailer Release At AMB Cinemas In Hyderabad | Sakshi
Sakshi News home page

Swathymutyam Trailer: ఆకట్టుకుంటున్న 'స్వాతి ముత్యం' ట్రైలర్

Published Mon, Sep 26 2022 3:21 PM | Last Updated on Mon, Sep 26 2022 4:06 PM

Swathymutyam Trailer Release At AMB Cinemas In Hyderabad - Sakshi

గణేశ్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ఈ చిత్రాన్ని 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.

 "నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్‌లో కలుస్తారు" అంటూ కథానాయిక వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఓవరాల్‌గా ప్రేమకథ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే దసరాకు కుటుంబ సమేతంగా చూసేలా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. "ముందుగా నేను గణేశ్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందు కలిసింది అతన్నే. ఈ కథ అంగీకరించినందుకు బిగ్ థాంక్స్. ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్‌లో ఒకబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది' అని అన్నారు. 

హీరో గణేశ్ మాట్లాడుతూ.. '2020లో కరోనా టైంలో ఒక సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటుండగా లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. కానీ ట్రైలర్ లాగే సినిమా చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాన' అని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement