
Ryan Reynolds Goes Speechless When A Kid Ask About Kiss Scene: హాలీవుడ్ స్టార్ హీరో జాబితాలో ఒకరిగా చేరాడు ర్యాన్ రేనాల్డ్స్. ఆయన నటించిన డెడ్‌పూల్ 1, డెడ్‌పూల్ 2, ఫ్రీ గాయ్, రెడ్ నోటీస్ చిత్రాలు మంచి ప్రేక్షాదరణ పొందాయి. ఇందులో ఎప్పుడూ వాగుతూ, వ్యంగంగా మాట్లాడే హీరోగా అలరించాడు ర్యాన్. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా ర్యాన్‌ది పెద్ద నోరేనట. ఎప్పుడూ తనదైన శైలీలో చమత్కారంగా కౌంటర్‌లు ఇస్తుంటాడు. అతని హాస్య చతురతని ఎవరూ బీట్ చేయలేరని కూడా ఓ టాక్ ఉంది. అయితే అందరినీ ఆటపట్టించే ర్యాన్ రేనాల్డ్స్‌కు ఓ పిల్లాడు వేసిన ప్రశ్న నోటి మాట రాకుండా చేసింది. సరదాగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ర్యాన్ రేనాల్డ్స్ తాజాగా నటించిన చిత్రం 'ది ఆడమ్ ప్రాజెక్ట్'. ఈ సినిమాకు సంబంధించి విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రశ్నలు-సమాధానాలు సెషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక చిన్న పిల్లవాడు (10 సంవత్సరాలు) మైక్ తీసుకుని సినిమాలో జో సల్దానాతో ముద్దు సీన్ గురించి ఆసక్తిగా అడిగాడు. 'మీరు ఆ అమ్మాయిని నిజంగానే ముద్దు పెట్టుకున్నారా ?' అని ర్యాన్‌ను ఆ పిల్లాడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో సమావేశంలోని అందరూ నవ్వడం ప్రారంభించారు. ఆ ప్రశ్నతో ఆశ్చర్యానికి గురైన ర్యాన్ కొద్దిసేపు ఆగి సమాధానం ఇచ్చాడు.
'ఒక రకంగా నిజమే అని అనుకుంటున్నాను. అయినా ఈ ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను ? ఇక ఇది ప్రతీ చోటా ప్రసారం చేస్తారు. అంటే.. అది నా ఉద్దేశం కాదు.' అని చెప్పిన ర్యాన్ సమాధానానికి అందరూ అతన్ని చూసి నవ్వారు. తర్వాత తన సిగ్గును కొంచెం దాచిపెడుతూ 'నా సొంత పిల్లలకు ఈ విషయం గురించి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒకవేళ వారు ఇది చూసి, డాడీ.. మీరేం చేస్తున్నారు? అని అడిగితే ఇలానే స్పందిస్తానేమో. కోపం ఏం లేదు. కొద్దిగా నిరాశ మాత్రమే.' అని ర్యాన్ రేనాల్డ్స్ చెప్పాడు. ఆ పిల్లాడు అడిగిన ప్రశ్నకు చప్పట్లు కొట్టి.. సెటైరికల్‌గా అతనితో 'ఆ విధంగా ముగిసిందన్నమాట' అని అన్నాడు ర్యాన్ రేనాల్డ్స్.
Comments
Please login to add a commentAdd a comment