బాలీవుడ్ బ్యూటీ కీర్తీ కుల్హారీ, సీనియర్ నటి షెఫాలీ షా కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్ 'హ్యూమన్'. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఇద్దరు మహిళా వైద్యులు డ్రగ్ ట్రయల్స్, దాని చుట్టూ ఉండే రాజకీయ కోణం, నేరం, చంపేస్తామనే బెదిరింపులను ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. ఇందులో కీర్తి కుల్హారీ స్వలింగ సంపర్కురాలైన డాక్టర్ సైరా సబర్వాల్ పాత్రలో నటించింది. అయితే కథలో భాగంగా తన సహనటి షెఫాలీ షాతో కీర్తి ముద్దు సీన్‌లో నటించాల్సి ఉంది. అప్పుడు వారు ముద్దు పెట్టుకున్న సీన్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది కీర్తి. ఆ కిస్ సీన్‌ను తీసేటప్పుడు డైరెక్టర్ మోజెజ్ సింగ్ చాలా నెర్వస్ అయ్యారని చెప్పుకొచ్చింది.
అలాగే ' ఆ సమయంలో నాకు ఒకే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. ఆమెను కిస్ చేస్తే ఏమైనా అనుభూతికి లోనవుతానా ? ఒకేవేళ నాకు మూడొచ్చేస్తే ? మళ‍్లీ కాస్తా ఆగి వెనక్కి వెళ్లి ఆలోచించాను. ఏంటీ ? నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా ? ముద్దు సన్నివేశం అయ్యాక హమ్మయ్యా అనిపించింది. షెఫాలీతో నేను రిహార్సల్స్ వంటివి ఏం చేయలేదు. కానీ ముద్దు సన్నివేశాన్ని విభిన్న కోణాల్లో తీసేందుకు 8-10 సార్లు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు టేక్‌ల తర్వాత మేము మాకు రోబోల్లాగా అనిపించాం. ఎందుకంటే తెరపైన కిస్, శృంగార సన్నివేశాలు వస్తే ప్రజలు అనుభూతి చెందుతారేమో కానీ మాకు మాత్రం చాలా బోరింగ్‌గా ఉంటుంది. మీ చుట్టూ 100 మంది ఉంటారు. ఎలాంటి ప్రైవసీ ఉండదు. కేవలం డైరెక్టర్ చెప్పే యాక్షన్, కట్ వంటి దయాదాక్షిణ్యాల మధ్య ఆ సన్నివేశాల్లో నటించాలి కాబట్టి. అలాంటి సమయంలో మీరు మీరు అస్సలు అనుభూతి చెందలేరు. నన్ను నమ్మండి.' అని కీర్తి చెప్పింది.
ఈ సన్నివేశంతో తాను ఆన్‌స్క్రీన్ వర్జినిటీ కోల్పోయానని షెఫాలీ షా పేర్కొంది. ఇంతకుముందు తాను ఇలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదని స్పష్టం చేసింది. ఈ మెడికల్ థ్రిల్లర్ జనవరి 14 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది.
ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా
Comments
Please login to add a commentAdd a comment