![Bigg Boss Fame Monal Gajjar Bailgadi Song Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/5/Bailgadi.jpg.webp?itok=mW9iIjUT)
బిగ్‌బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి వచ్చాక ఈ బ్యూటీకి దర్శకనిర్మాతలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన కాగజ్ సినిమాలోని ఓ పాట నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ‘బైల్ గాడి’అంటూ సాగే ఈ పాటను ప్రవేశ్‌మల్లిక్ సంగీతం అందించగా, ఉదిత్ నారాయణ్ ఆలపించారు.
ఇక కాగజ్ సినిమా విషయానికొస్తే.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక సామాన్యుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ. అజంఘర్‌కు చెందిన భరత్ లాల్ బిహారీ అనే రైతు జీవిత కథ ఇది. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఇతర బాలీవుడ్ చిత్రాల్లా కాకుండా నాన్ గ్లామరస్ బ్యాక్‌డ్రాప్ చిత్రంగా ‘కాగజ్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్నిసల్మాన్‌ఖాన్ నిర్మాతగా సొంత బేనర్‌లో నిర్మించారు.ఈ బయోగ్రఫికల్ డ్రామాకు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మోనాల్ గజ్జర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో జీ5 ఓటీటీలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment