50 సార్లు అరెస్ట్‌ అయ్యింది.. అయినా కూడా | Mumbai Woman Domestic Helper Arrested Over 50 Times for House Theft | Sakshi

50 సార్లు అరెస్ట్‌ అయ్యింది.. అయినా కూడా

Jun 18 2021 9:33 AM | Updated on Jun 18 2021 10:42 AM

Mumbai Woman Domestic Helper Arrested Over 50 Times for House Theft - Sakshi

ఆమెను అరెస్ట్‌ చేసి చేసి పోలీసులకు అలుపొస్తుంది కానీ ఆమె మాత్రం మారడం లేదు

ముంబై: పని మనిషిగా చేరుతుంది.. ఓ పది రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అందినకాడికి దోచుకుని జంప్‌ అవుతుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సార్లు దొంగతనాలకు పాల్పడింది... ఏకంగా 50 సార్లు అరెస్ట్‌ అయ్యింది. అయినా కూడా ఆ మహిళ తన అలవాటును మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్‌ చేసి చేసి పోలీసులకు అలుపొస్తుంది కానీ ఆమె మాత్రం మారడం లేదు. 

ఆ వివారలు.. ముంబైకి చెందిన వనితా గైక్వాడ్‌(38) అనే మహిళ ఇళ్లల్లో పని చేస్తుంటుంది. పది రోజుల క్రితం ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులతో పరారయ్యింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వనితా గైక్వాడ్‌ చేతి వాటాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘నిందితురాలిని ఇప్పటికి 50 సార్లు అరెస్ట్‌ చేశాం. ప్రతి సారి ఆమె పేరు మార్చుకుని.. దొంగతనాలకు పాల్పడుతుంది. ఎన్ని సార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోవడం లేదు. పనికి కుదిరిన ప్రతి చోట 10 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తస్కరిస్తుంది’’ అని తెలిపారు.

చదవండి: పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement