తుపాకీతో బెదిరించి పనమ్మాయిపై రేప్ | Delhi Cop Allegedly Rapes Friend's Domestic Help at Gunpoint, Arrested | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించి పనమ్మాయిపై రేప్

Jul 12 2015 10:45 AM | Updated on Jul 28 2018 8:51 PM

తుపాకీతో బెదిరించి పనమ్మాయిపై రేప్ - Sakshi

తుపాకీతో బెదిరించి పనమ్మాయిపై రేప్

న్యాయాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి కామాంధుడిగి మారాడు.

న్యూఢిల్లీ: చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి కామాంధుడిగా మారాడు. మానవ మృగాల నుంచి ప్రజలకు రక్షణ కల్సించడానికి ప్రభుత్వం ఇచ్చిన తుపాకీతోనే యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలు..  పంజాబీబాగ్ పోలీస్ స్టేషన్లో జగ్వీర్ సింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న జగ్వీర్ 23 ఏళ్ల పనమ్మాయిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జగ్వీర్ తుపాకీతో బెదిరించడం, భయంతో ఆ అమ్మాయి అతని పక్కన వచ్చి కూర్చోవడం అంతా అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వైద్యపరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు.

ఈ వ్యవహారంలో డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీ కోసం వేచి చూడాల్సిన పనిలేదని, అతన్ని వెంటనే డిస్మిస్ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. మహిళలపై జరిగే ఎలాంటి దాడులనైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు అధికారిని శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement