
సాక్షి,న్యూఢిల్లీ : తన మూడేళ్ల కుమార్తెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిని పొరుగింటి వారు హత్య చేసిన ఘటన వాయువ్య ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో చోటుచేసుకుంది. తమ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాకేష్ అనే వ్యక్తి తన పొరుగున ఉండే కృష్ణను ప్రశ్నించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.
స్ధానికులు ఇరువురికి సర్ధిచెప్పడంతో వెనక్కితగ్గగా, మరో అరగంట అనంతరం రాకేష్ తన భార్య పూజ,సోదరుడు ముఖేష్‌తో కలిసి కృష్ణ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. దీంతో కృష్ణ ఆయన సోదరుడు రంజీత్ రాకేష్‌పై పదునైన ఆయుధంతో దాడిచేశారు. రాకేష్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నిందితులు రంజిత్, కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment