జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష | Jackie Chan's son Jaycee jailed for drug offence in China | Sakshi
Sakshi News home page

జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష

Published Fri, Jan 9 2015 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష - Sakshi

జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష

యాక్షన్ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకుల మన్నలను పొందిన హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్‌కు తన కుమారుడి వల్లే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టిస్ట్‌గా తండ్రి జాడల్లో నడుస్తున్న జైసీ చాన్‌కు మాదకద్రవ్యాల కేసులో ఆరునెలల జైలు శిక్ష పడింది. చైనా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న జాకీచాన్ ఇప్పటికే తన కొడుకు పాల్పడిన నేరానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో జాకీ చాన్ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. జైసీతో పాటు తైవాన్ నటి కొచెన్ టుంగ్‌కు కూడా శిక్ష పడింది. జైసీ చాన్ ఇప్పటివరకూ 20 చిత్రాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement