జాకీ చాన్ కుమారుడు అరెస్ట్ | Jackie Chan's son held in China for possession of drugs | Sakshi
Sakshi News home page

జాకీ చాన్ కుమారుడు అరెస్ట్

Published Mon, Aug 18 2014 4:17 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

జాకీ చాన్ కుమారుడు అరెస్ట్ - Sakshi

జాకీ చాన్ కుమారుడు అరెస్ట్

బీజింగ్: కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. 

 

అయితే పోలీసులు అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్నది మాత్రం వెల్లడికాలేదు. ఈ రోజూ చైనా మీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు తన పోస్ట్ లతో టచ్ లో ఉండే ఈ హీరో వ్యాఖ్యలు గత మంగళవారం నుంచి వెలుగుచూడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement