Jaycee Chan
-
ఏడాదికోసారి... మా అబ్బాయిని జైలుకి పంపిస్తా!
మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకుడు జాకీ చాన్ వారసుడు జేసీ చాన్ తండ్రిలానే ఈ కళలో భేష్ అనిపించుకున్నారు. తండ్రిలా రిస్కీ యాక్షన్ చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకెళుతూ, మంచి పేరు తెచ్చుకున్న జేసీ చాన్ ఆ మధ్య మాదకద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేరానికి గాను జేసీ ఆరు నెలల జైలు జీవితం గడిపాక, ఇటీవలే విడుదలయ్యారు. ఈ ఆరు నెలల శిక్ష జేసీలో చాలా మార్పు తీసుకువచ్చిందట. తనయుడిలో వచ్చిన మార్పు గురించి జాకీ చాన్ చెబుతూ - ‘‘జైలుకు ముందు... ఆ తర్వాత జేసీ జీవితంలో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు తను అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యంగా ఉండేవాడు. వేసుకునే దుస్తుల నుంచి వాడుకునే వస్తువుల వరకూ అన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ విసిరేసేవాడు. బూట్లు కూడా అంతే. కానీ, ఇప్పుడు అలా కాదు. బయటి నుంచి ఇంటికి రాగానే పాదరక్షలను చక్కగా, వాటికి కేటాయించిన ర్యాక్‌లో పెట్టేస్తున్నాడు. అల్మారాలో బట్టలు సరిగ్గా సర్దుకుంటున్నాడు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. వంటగదిలోకెళ్లి వాళ్ల అమ్మకి సహాయం చేస్తున్నాడు. ఒక రోజు గిన్నెలు కూడా కడిగాడు. అందుకే మా అబ్బాయిని ఏడాదికోసారి జైలుకి పంపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా’’ అని సరదాగా అన్నారు. -
జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల
బీజింగ్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుమారుడు జైయ్ సీ చాన్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. జైయ్ సీ చాన్తోపాటు అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు... జైయ్ సీ చాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో జైయ్ సీకి రూ.326 డాలర్ల జరిమాన కూడా విధించింది. ఇదే కేసులో అతడి స్నేహితుడు కై కో చెన్కు 14 రోజుల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో అరెస్ట్ అయిన జైయ్ సీ చాన్ ఆరు నెలల జైలు శిక్ష ముగియడంతో శుక్రవారం విడుదలయ్యారు. తన కుమారుడు తప్పు చేసినట్లు జాకీచాన్ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే జైలులో ఉన్న తన కుమారుడు జాయ్ సీ చాన్ విడుదల కోసం బెయిల్ కోసం దరఖాస్తు చేయనని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై జైలుపాలైన జెసీ చాన్.. తన తండ్రి జాకీచాన్ పై పలు ఆరోపణలు గుప్పించాడు. తాను జైలుకు వెళ్లడానికి తండ్రే ప్రధాన కారణమని ఆరోపించాడు. తనకు మార్గదర్శిగా నిలవాల్సిన తండ్రి తనను పూర్తిగా విస్మరించాడన్నారు. తను మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైనందుకు సిగ్గుపడుతున్నానని తల్లి జాన్ లిన్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశాడు. జాకీచాన్ పై కుమారుడు ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా జేసీ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టడం వల్ల తను ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాన్నారు. తన తండ్రి ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపేవారని, తనను ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సంఘటనలతో సహజంగానే తను తల్లికి దగ్గరయ్యానన్నారు. జేసీ జైలు పాలై ఐదు నెలలైనా ఇప్పటివరకూ తల్లిదండ్రులిద్దరూ చూడటానికి రాలేదని ఆరోపించారు. తల్లిని చూడగానే జేసీ చాన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడన్నారు. -
జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష
యాక్షన్ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకుల మన్నలను పొందిన హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్‌కు తన కుమారుడి వల్లే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టిస్ట్‌గా తండ్రి జాడల్లో నడుస్తున్న జైసీ చాన్‌కు మాదకద్రవ్యాల కేసులో ఆరునెలల జైలు శిక్ష పడింది. చైనా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న జాకీచాన్ ఇప్పటికే తన కొడుకు పాల్పడిన నేరానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో జాకీ చాన్ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. జైసీతో పాటు తైవాన్ నటి కొచెన్ టుంగ్కు కూడా శిక్ష పడింది. జైసీ చాన్ ఇప్పటివరకూ 20 చిత్రాల్లో నటించారు. -
జాకీచాన్ కుమారుడికి జైలు శిక్ష
బీజింగ్: నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నటుడు, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీచాన్ తనయుడు జాయ్ సీ చాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీనితోపాటు రూ. 326 డాలర్ల జరిమాన విధించినట్లు తీర్పులో పేర్కొంది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని... జాయ్ సీ చాన్.. ఫాంగ్ జుమింగ్గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన కోర్టు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. -
రాజకీయ పలుకుబడిని వాడుకోను: జాకీచాన్
బీజింగ్: తన కొడుకు జేసీ చాన్ చేసినపనికి తాను సిగ్గుపడుతున్నట్లు హాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ హీరో జాకీచాన్ చెప్పారు. అయితే అతన్ని కాపాడేందుకు తాను తన రాజకీయ పలుకుబడిని వాడుకోననని ఆయన చెప్పారు. తన కొడుకు ఏదో ఒకరోజు తనలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారకర్త అవుతాడన్న ఆశాభావాన్ని జాకీచాన్ వ్యక్తం చేశారు. గాయకుడు, నటుడు జేసీ చాన్(32)ను మత్తుపదార్థాల కేసులో ఈ నెల 6న బహిరంగంగా విచారించనున్నట్లు బీజింగ్‌లోని ఓ కోర్టు మంగళవారం ప్రకటించింది. మత్తుపదార్ధాల నేరాలకు సంబంధించి జేసీచాన్, తైవాన్ సినీ నటుడు కో చెంగ్ తుంగ్, మరి కొంతమందిని బీజింగ్ పోలీసులు గత ఏడాది ఆగస్ట్ 14న అరెస్ట్ చేశారు. జేసీ, కోలు తాము మరిజువానా వాడినట్లు అంగీకరించారు. చైనాలో ఇలాంటి నేరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. మాదకద్రవ్యాలు వాడేవారికి గట్టి హచ్చరిక ఇచ్చేందుకు ఈ కేసులో వీరిని బహిరంగంగా విచారణ చేయనున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆక్రోబాటిక్ ఫైటింగ్ స్టయిల్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు అయిన జాకీచాన్ వంద సినిమాలలో నటించారు. చాన్ పేరు చెబితే చాలు మార్షల్ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాకీచాన్ గతంలో చైనాలో ప్రచారం నిర్వహించారు. అటువంటి చాన్ కొడుకు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. తన కుమారుడు చేసిన తప్పుకు అప్పట్లో చాన్ క్షమాపణలు కూడా చెప్పారు. -
క్షమాపణ చెప్పిన హీరో కొడుకు
బీజింగ్: మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. నిషేధిత డగ్స్ కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే ఎమ్ స్టోన్స్ క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు. -
జాకీ చాన్ కుమారుడు అరెస్ట్
బీజింగ్: కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులు అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్నది మాత్రం వెల్లడికాలేదు. ఈ రోజూ చైనా మీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు తన పోస్ట్ లతో టచ్ లో ఉండే ఈ హీరో వ్యాఖ్యలు గత మంగళవారం నుంచి వెలుగుచూడలేదు.