జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల | Jackie Chan's son released after 6-month prison term | Sakshi
Sakshi News home page

జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల

Published Fri, Feb 13 2015 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల

జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల

బీజింగ్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుమారుడు జైయ్ సీ చాన్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. జైయ్ సీ చాన్తోపాటు అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన  పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు... జైయ్  సీ చాన్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది.

ఈ కేసులో జైయ్ సీకి రూ.326 డాలర్ల జరిమాన కూడా విధించింది. ఇదే కేసులో అతడి స్నేహితుడు కై కో చెన్కు 14 రోజుల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో అరెస్ట్ అయిన జైయ్ సీ చాన్ ఆరు నెలల జైలు శిక్ష ముగియడంతో శుక్రవారం విడుదలయ్యారు. తన కుమారుడు తప్పు చేసినట్లు జాకీచాన్ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే జైలులో ఉన్న తన కుమారుడు జాయ్ సీ చాన్ విడుదల కోసం బెయిల్ కోసం దరఖాస్తు చేయనని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement