మహిళపై సామూహిక అత్యాచారం | Mass rape of women | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక అత్యాచారం

Published Wed, Oct 1 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

Mass rape of women

కోహీర్: ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జహీరాబాద్ సీఐ సాయిఈశ్వర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొరంగ్‌పల్లికి చెందిన మహిళ (32)ను సోమవారం సరుకులు కొనడానికి మునిపల్లి మండలం బుధేరా సంతకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా..

ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా చింతల్‌ఘాట్ శివారులోకి తీసుకెళ్లారు. మధ్యలో వారికి మరో వ్యక్తి జత కలిశాడు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారికి కొద్ది దూరంలో ఆమెను తీసుకెళ్లి  ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement