woman kidnapped
-
చికెన్ షాపు యజమాని వీరంగం
కర్ణాటక: కొనుగోలుదారుపై కత్తితో దాడి చేసిన చికెన్ షాపు యాజమానిని రాయకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు రాయకోటకు చెందిన రోషన్ (41)కి చికెన్ అంగడి ఉంది. శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి (36) వెళ్లి చికెన్ కొన్నాడు, కానీ నాణ్యంగా లేదని చెప్పడంతో ఆవేశానికి గురైన రోషన్ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలేర్పడిన అతను రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి రోషన్‌ను అరెస్ట్ చేశారు. మహిళ కిడ్నాప్‌పై ఫిర్యాదు కూతురు కిడ్నాప్ అయ్యిందని ఆమె తండ్రి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూళగిరి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళ కుందారపల్లిలో నిర్వహిస్తున్న ఓ హోటల్లో పనిచేసేది. గత 7వ తేదీ విధులకెళ్లిన ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అంతటా గాలించాడు. స్థానికుల సమాచారం మేరకు అదే హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్న సలావుద్దీన్ బాషా కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
యువతిని ఎత్తుకెళ్లి.. ఎడారిలో రాక్షస వివాహం
యువతితో తన నిశ్చితార్థాన్ని ఆమె కుటుంబ సభ్యులే రద్దు చేశారన్న కోపంతో ఆమెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఈ ఘటన జరిగింది. బాధిత యువతితో నిందితుడు పుష్పందర్ సింగ్‌కు నిశ్చితార్థం కుదిరింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు దాన్ని రద్దు చేశారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు తన స్నేహితులతో కలిసి జూన్ 1న యువతిని ఎడారిలోకి ఎత్తుకెళ్లాడు. ఆమె ఏడుస్తున్నా.. పెళ్లి చేసుకున్నాడు. (హిందు సంప్రదాయం ప్రకారం) ఆ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. యువతిని అదే రోజు రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముగ్గుర్ని అరెస్టు చేయగా.. ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy — Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023 ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్.. చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను షేర్ చేసి.. 'ఇది నిజంగా భయానక ఘటన. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం'అని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఒడిశాలో దారుణం.. ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు మృతి -
మహిళను కిడ్నాప్ చేసిన 15 మంది యువకులు
-
బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్‌పై ఎక్కించి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ఆల్మండ్ హౌస్ వెనుకాల నిర్మానుష్య చీకటి ప్రదేశంలో మద్యంమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైక్‌లపై వచ్చి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతి కూడా మద్యం మత్తులో ఉండగా ఆమెను తమ బైక్‌పై ఎక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కిందపడుకుంది. అయితే అప్పటికే బైక్ స్టార్ చేసి ఓ యువకుడు సిద్ధంగా ఉండటంతో యువతి ‘హెల్ప్‌హెల్ప్’ అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకునే లోపే ఆమెను ఓ యువకుడు బలవంతంగా బైక్‌పై కూర్చుండబెట్టుకొని ఉడాయించాడు. స్థానిక మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే యువకులంతా బైక్‌లపై పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా స్పష్టమైన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే బలవంతంగా యువతిని బైక్‌పై ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రంతా మూడు పోలీసు బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాయి. నిర్మానుష్య ప్రాంతామే కాకుండా చీకటి ఉండటంతో ఇక్కడ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో సరిగ్గా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్‌కు గురైన యువతి ఎవరన్న దానిపై స్పష్ట రావడం లేదు. యువతి అదృశ్యం పంజగుట్ట: యువతి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో నివసించే గౌతం దుర్గేశ్వరి(18) పంజగుట్టలోని ఓ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంది. మంగళవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన దుర్గేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. షాపులో సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 7:10కి షాపు నుంచి వెల్లిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టుప్రక్కల సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616365 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..! -
యువతిని కిడ్నాప్ చేసి.. బ్లేడ్లతో దాడి
-
బంజారాహిల్స్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సంపన్న ప్రాంతం బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో మూడురోజుల కిందట చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన సమీరా ఆరు నెలల కిందట దుబాయ్ నుంచి వచ్చి నగరంలో ఉంటున్నారు. ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్‌తో ఏవో గొడవలు అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరోజ్ తన గర్ల్‌ఫ్రెండ్ కీర్తితో కలిసి మూడు రోజుల కిందట ఓ పబ్‌లో సమీరాపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమెపై బ్లేడ్లతో దాడి చేసి.. కారులో అపహరించుకుపోయారు. ఆ తర్వాత కీర్తి నివాసంలోని బాత్రూమ్లో తననను బంధించి.. హింసించారని, ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నుంచి నగదు, నగలను వారు దోచుకొని.. తనను హింసించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలు సమీరాకు తీవ్రంగా గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఒంటిపై, మెడపై బ్లేడ్‌తో చేసిన గాయాలున్నాయి. అయితే, బాధితురాలు వాదనను కూడా పూర్తిగా నమ్మలేమని, సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే ఈ కిడ్నాప్ ఉదంతం వెనుక నిజానిజాలు తెలిసే అవకాశముందని పోలీసులు అంటున్నారు. -
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్..
హైదరాబాద్: నగరంలో ఓ యువతి కిడ్నాప్ గురైన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. దుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న అర్చనా దూబే(22) అనే యువతి బుధవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న ఓ కిరాణా షాపులో సరుకులు కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వినోద్ దూబే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మహిళను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా చర్ల మండలం సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎర్రబోరు గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళను గురువారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తోందనే అనుమానంతోనే వారు ఈ చర్యకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అయితే, మావోయిస్టుల వైపు నుంచి ఎటువంటి సమాచారం లేదు. -
తెలుగు మహిళ పై అకృత్యం
టీనగర్: కోయంబేడు బస్టాండులో ఒంటరిగా నిలుచునే మహిళలను కిడ్నాప్ చేసి వారితో రాసలీలలు సాగించే ఎంటీసీ బస్‌డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, విరుగంబాక్కం పిళ్లయార్కోవిల్ వీధికి చెందినముత్తుకుమార్ (25) కోయంబేడు మార్కెట్లో కూలీ. ఇతను ఆంధ్రాకు చెందిన జ్యోతి (23)ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. శనివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో జ్యోతి బిడ్డతోపాటు ఆంధ్రాకు వెళ్లేందుకు కోయంబేడు బస్టాండు చేరుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి జ్యోతితో తాను ఎంటీసీ డ్రైవర్‌నని, ఏమి సమస్యంటూ? ఓదార్చారు. ఆ తర్వాత బిడ్డతోపాటు జ్యోతిని బస్సులో తిరువేర్కాడు తీసుకెళ్లాడు. అక్కడ ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో జ్యోతి నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో బిడ్డను తీసుకుని సదరు వ్యక్తి పరారయ్యాడు. హఠాత్తుగా నిద్రలేచిన జ్యోతి బిడ్డ, ఆ వ్యక్తి కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందింది. దీనిగురించి ఆమె లాడ్జిలో వాకబు చేసింది. దీంతో సమస్య ఏర్పడుతుందనే భయంతో లాడ్జి ఉద్యోగులు, వెంటనే ఆ మహిళను లాడ్జి నుంచి పంపివేశారు. దీనిగురించి జ్యోతి తిరువేర్కాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జిలో విచారణ జరిపారు. బిడ్డను అపహరించిన వ్యక్తి నీతిమణి (45), చెన్నై, తిరునిండ్రవూరుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఆ చిరునామాకు వెళ్లి పోలీసులు విచారణ జరపగా అది నకిలీదిగా తేలింది. ఇలావుండగా గూడువాంజేరి రైల్వే స్టేషన్లో 40 ఏళ్ల వయసుగల ఒక వ్యక్తి మద్యం మత్తులో బిడ్డతోపాటు కనిపించాడు. దీంతో అతన్ని అనుమానించిన రైల్వే పోలీసులు అతన్ని,బిడ్డను గూడువాంజేరి పోలీసు స్టేషన్లో అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి మురుగానందం (40), చెన్నై ఎంటీసీ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. సహ డ్రైవర్‌ను చూసేందుకు కోయంబేడుకు రాగా జ్యోతిని మోసగించి తిరువేర్కాడుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అతన్ని తిరువేర్కాడు పోలీసులకు అప్పగించారు. అతని వద్ద తీవ్ర విచారణ జరపగా కోయంబేడు బస్టాండులో ఒంటరిగా అవస్థలు పడే మహిళలను గుర్తించి లాడ్జికి తీసుకువెళతానని తెలిపాడు. చెంగల్పట్టులో ఉన్న బంధువుకు బిడ్డను అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డానని తెలిపాడు. జ్యోతిని, ఆమె బిడ్డను చెంగల్పట్టు మహిళా సంరక్షణాలయంలో ఉంచారు. పోలీసులు మురుగానందంను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు పుళల్ జైలులో నిర్బంధించారు. -
మహిళపై సామూహిక అత్యాచారం
కోహీర్: ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జహీరాబాద్ సీఐ సాయిఈశ్వర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొరంగ్‌పల్లికి చెందిన మహిళ (32)ను సోమవారం సరుకులు కొనడానికి మునిపల్లి మండలం బుధేరా సంతకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా చింతల్‌ఘాట్ శివారులోకి తీసుకెళ్లారు. మధ్యలో వారికి మరో వ్యక్తి జత కలిశాడు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారికి కొద్ది దూరంలో ఆమెను తీసుకెళ్లి ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయి తెలిపారు. -
ప్రేమ వివాహం చేసుకుందని ...
తిరునల్వేలి సమీపంలో ప్రభుత్వ బస్సును అటకాయించి ప్రేమ వివాహం చేసుకున్న యువతిని ఒక ముఠా కారులో కిడ్నాప్ చేసింది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రేమికుడు దాడికి గురయ్యాడు. దీనికి సంబంధించి మహిళా సబ్ఇన్స్పెక్టర్ సహా నలుగురిపై కేసు దాఖలైంది. రాధాపురం సమీపం ఆవరై కుళం అంబలవానపురానికి చెందిన రాజదురై కుమారుడు శంకర్ (26). ఆరల్‌వాయ్‌మొళిలోగల కళాశాలలో చదువుతున్నారు. ఇతనికి, కన్యాకుమారి జిల్లా రామపురం సమీపాన కులశేఖరన్ పుదూర్‌కు చెందిన ఇసక్కి యప్పన్ కుమార్తె గంగ (21)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిరువురు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో గంగా తల్లిదండ్రులు వివాహానికి వ్యతిరేకత తెలిపారు. ప్రేమికులు ఇరువురు స్నేహితుల సాయంతో ఇడలాకుడి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10, మార్చి 2014న రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. గంగను విడిపించాలని కోరుతూ ఆమె తండ్రి ఇసక్కియప్పన్ మదురై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుశీంద్రం సబ్ ఇన్స్పెక్టర్ జయంతి, పోలీసులు విచారణ జరిపి, గంగా, ఆమె ప్రేమికుడు శంకర్లను మదురై హైకోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఆ సమయంలో గంగ తన భర్త శంకర్‌తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో గంగ, ఆమె తల్లిదండ్రులు ప్రేమికుడు శంకర్, సోమవారం సాయంత్రం ప్రభుత్వ బస్సులో నాగర్‌కోయిల్‌కు బయలుదేరి వచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ జయంతి కూడా వారితో వచ్చారు. నాంగునేరి టోల్‌గేట్‌కు అర్ధరాత్రి 11 గంటల సమయంలో బస్సు చేరుకోగా, అక్కడికి కారులో వచ్చిన నలుగురు మారణాయుధాలతో బస్సును అటకాయించి గంగను కిడ్నాప్ చేశారు. శంకర్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై దాడి చేసిన ముఠా గంగను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. దాడిలో గాయపడ్డ శంకర్‌ను నాంగునేరి ఆస్పత్రికి తరలించారు. గంగను కిడ్నాప్ చేస్తున్న సమయంలో బస్సులో ఉన్న ఎస్ఐ జయంతి, సిబ్బంది కిడ్నాప్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. శంకర్ నాంగునేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగకుమారి విచారణ జరిపి గంగ తండ్రి ఇసక్కియప్పన్, తల్లి లక్ష్మి, బంధువు సుబ్బయ్య, సబ్ ఇన్స్పెక్టర్ జయంతిపై కేసు దాఖలు చేశారు.