రంగియా: ప్రేమ పేరుతో నమ్మించాడు. పేరు మార్చి ఏమార్చాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి ప్రియురాలిని సామూహికంగా అత్యాచారం చేశాడు. అస్సాంలోని రంగియా జిల్లాలో శనివారం ఈ ఘాతుకం జరిగింది. 25 ఏళ్ల మహిళతో నల్బరీవాసి ఫక్రుద్దీన్ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. తన పేరు రాహుల్ బోస్‌గా చెప్పుకున్నాడు.
శనివారం ఆమె సినిమాకు తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర వదిలేస్తానంటూ ఆమెను ఓ పాఠశాల వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అతని ఏడుగురు మిత్రులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. ఎనిమిది మందిలో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫకృద్దీన్ పరారయ్యాడు. మహిళకు జరిపిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు.
నమ్మించి గ్యాంగ్ రేప్
Published Mon, Sep 15 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement