Rahul Bose
-
బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!
ముంబై : రెండు అరటి పండ్లకు ఏకంగా రూ.443 బిల్లు వసూలు చేసి చంఢీగడ్‌లోని మారియట్ హోటల్ వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ట్విటర్లో ఈ విషయం పంచుకోవడంతో ఎక్సైజ్-పన్నుల శాఖ స్పందించింది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపండ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. ఇక ఈ సంఘటన మరువక ముందే ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ ఘనకార్యం బయటపడింది. రెండు కోడిగుడ్లకు సదరు హోటల్ ఏకంగా రూ.1700 వసూలు చేసిందని ‘ఆల్ ద క్వీన్స్ మెన్’ పుస్తక రచయిత కార్తీక్ దార్ ట్విటర్లో పేర్కొన్నాడు. రాహుల్ బోస్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘నిరసన వ్యక్తం చేద్దామా భాయ్..!’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ‘గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా’ అని ఒకరు.. ‘చికెన్ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా’అని మరొకరు కామెంట్ చేశారు. ఇక రెండు ఎగ్ ఆమ్లెట్లకు కలిపి ఫోర్ సీజన్స్ రూ.1700 బిల్ చేయడం గమనార్హం. -
ఆటలో అరటి పండు
-
బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ బనానా లెక్క తీరింది. రెండు అరటిపళ్లకు జీఎస్టీ అంటూ రూ.442.50 బిల్లు వేసారని అతను చేసిన ట్వీట్‌పై ఎక్సైజ్-పన్నుల శాఖ స్పందించింది. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై చర్యలు తీసుకుంది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపళ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు. అయితే ఆ అరటి పళ్ల బిల్లు చూసి కళ్లు తేలేసాడు. ఆ రెండు అరటిపళ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలపి ఏకంగా రూ.442.50 బిల్లు వేసింది. ‘పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.’ అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట తెగహల్‌చల్ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించి ఆ హోటల్‌పై రూ.25వేల జరిమానా వేసింది. Fine of Rs 25,000 imposed on hotel JW Marriott by Excise and Taxation Department, Chandigarh for violation of section 11 of CGST (illegal collection of tax on an exempted item) in connection with actor Rahul Bose's tweet over the price of two bananas served to him by the hotel. — ANI (@ANI) July 27, 2019 చదవండి: బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..! -
బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!
చంఢీగర్ : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్యుడు వాటివంక కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతున్నాడు. జేబుకు చిల్లు పడుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాడు. సంపన్నులకు అలాంటిదేం ఉండదు. ఎంతంటే అంత పెట్టి కొంటారు. అయితే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు మాత్రం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఊహించని షాక్ ఇచ్చింది. జిమ్ చేసిన అనంతరం రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన అతను బిల్ చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్ చేశారు. ‘పండ్లు కూడా చెడు చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఇంత ధరపెట్టి కొంటే బాధగా ఉండదా..!’ అని ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాటిపై జీఎస్టీ కూడా వేశారని పేర్కొన్నాడు. బోస్ ట్వీట్‌పై కొందరు కామెంట్లు చేశారు. తాజా పండ్లపై జీఎస్టీ వేయడం అన్యాయమని ఒకరు.. పట్టపగలే దోచేస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా, భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్ ఉండటమెందుకు.. వేరొక లగ్జరీ రూమ్‌లోకి షిఫ్ట్ కావొచ్చు కదా’ అని ఇంకొకరు బోస్కి సలహా ఇస్తున్నారు. ‘సినిమా హాళ్లలో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. టికెట్లు, పాప్‌కార్న్‌కు భారీగా వసూలు చేస్తున్నారు. నువ్ మరో హోటల్‌కి మారడం మంచిది. అరటి పండ్లు బయట కూడా దొరుకుతాయి. అక్కడ కొనుక్కో’అని ఇంకో అభిమాని సూచించాడు. దిల్ దడ్కనే దో, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ది జపనీస్ వైఫ్, విశ్వరూపం-2 సినిమాల్లో బోస్ నటించారు. You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB — Rahul Bose (@RahulBose1) July 22, 2019 -
బాహుబలి ప్రీక్వెల్
డిజిటల్ మాధ్యమంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త షోలతో ముందుకొస్తోంది. సొంతంగా సినిమాలనూ రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాలు, ఒక సిరీస్‌తో రానున్నట్టు పేర్కొంది. రాజమౌళి సూపర్ హిట్ ఫ్యాంటసీ చిత్రం ‘బాహుబలి’ ప్రీక్వెల్ నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌గా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌లో నటించే వారిని తాజాగా అనౌన్స్ చేసింది. శివగామిగా మృణాల్ ఠాకూర్, స్కందదాస్గా రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి, అనూప్ సోనీ వంటి నటులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‌ను దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్నారు. -
రీల్‌పైకి రియల్ లైఫ్
‘‘పదమూడేళ్ల అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం మించిన కమర్షియాలిటీ ఏముంటుంది? ఇప్పటివరకూ హిందీలో వచ్చిన బయోపిక్స్‌లో స్టార్స్ నటించారు. మా సినిమాలో స్టార్స్ లేరు. కానీ, అమ్మాయిలు ఏదైనా సాధించగలరనే స్ఫూర్తివంతమైన కథాంశం ఉంది’’ అన్నారు హిందీ నటుడు రాహుల్ బోస్. అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం మలావత్ పూర్ణ జీవితకథతో రాహుల్ బోస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘పూర్ణ’ ఈ నెల 31న తెలుగు, హిందీ భాషల్లో రిలీజవుతోంది. మలావత్ పూర్ణ మాట్లాడతూ – ‘‘నా లైఫ్‌ను సినిమాగా తీస్తారని ఊహించలేదు. కథ గురించి దర్శకుడితో చర్చించాను. ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా చేయడం వల్లే ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మాయిలను చదువు మాన్పించడం, బాల్య వివాహాలు వంటివి చేయొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు’’ అన్నారు. ఈ బయోపిక్‌లో పూర్ణ పాత్రలో నటించిన అదితి పాల్గొన్నారు. -
నమ్మించి గ్యాంగ్ రేప్
రంగియా: ప్రేమ పేరుతో నమ్మించాడు. పేరు మార్చి ఏమార్చాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి ప్రియురాలిని సామూహికంగా అత్యాచారం చేశాడు. అస్సాంలోని రంగియా జిల్లాలో శనివారం ఈ ఘాతుకం జరిగింది. 25 ఏళ్ల మహిళతో నల్బరీవాసి ఫక్రుద్దీన్ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. తన పేరు రాహుల్ బోస్‌గా చెప్పుకున్నాడు. శనివారం ఆమె సినిమాకు తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర వదిలేస్తానంటూ ఆమెను ఓ పాఠశాల వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అతని ఏడుగురు మిత్రులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. ఎనిమిది మందిలో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫకృద్దీన్ పరారయ్యాడు. మహిళకు జరిపిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు.