‘ఎనిమిది నెలల్లో 229 రేప్‌లు’ | 229 rapes, 8 gangrapes recorded in Mumbai in 8 months | Sakshi
Sakshi News home page

‘ఎనిమిది నెలల్లో 229 రేప్‌లు’

Published Thu, Dec 5 2013 6:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

229 rapes, 8 gangrapes recorded in Mumbai in 8 months

 ముంబై: వాణిజ్య రాజధాని రేప్ రాజధానిగా మారిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు నగరంలో 229 అత్యాచారాలు, ఎనిమిది సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఎనిమిది నెలల్లోనే నమోదైన ఈ కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. సామాజిక కార్యకర్త అనిల్ గల్‌గలీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఈ విషయాలు ముంబైకర్లను కలవరపెడుతున్నాయి.
 
ఈ ఏడాది ఆఖరు వరకు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అనిల్ అన్నారు. నగర శివారు ప్రాంతం దిందోషి, బోరివలిలో మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారాలు నవంబర్‌లో రెండు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇదిలావుండగా దేశంలో సురక్షిత నగరం ముంబై అని పోలీసులు అంటున్నారు. అనేక కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ అత్యాచారాలు చేశారని తెలిపారు. ఇందుకు గతంలో జరిగిన కేసులే నిదర్శనమని ముంబై పోలీసు అసిస్టెంట్ కమిషనర్ భగవాన్ చటే అన్నారు. శక్తి మిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు అని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఇలాంటి నేరాలను సాధ్యమైనంత మేర అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement