ముంబైలో 229 అత్యాచారాలు, 8 గ్యాంగ్ రేప్స్
Published Wed, Dec 4 2013 12:50 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
గత 8 ఎనిమిది నెలల కాలంలో భారత ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో మహిళలపై అత్యాచారాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. సామాజిక కార్యకర్త అనిల్ గాల్ గాలి విజ్క్షప్తి మేరకు సమాచార హక్కు చట్టం కింద అందించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు చివరి వరకు ముంబైలో 229 అత్యాచార కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే పరిచయస్తులు, స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపోరుగు వారే అత్యధిక కేసుల్లో నిందితులు పోలీసులు తెలిపారు.
ఈ సంవత్సరం చివరి వరకు అత్యాచారాల సంఖ్య మరింత పెరుగుతుందని పోలీసులు తెలిపారు. నవంబర్ లోనే మైనర్లపై రెండు అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ లోపించడం, నాకా బందీలు చేయకపోవడం కారణంగానే మహిళపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు.
గత సంవత్సరం 223 అత్యాచా కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు కాగా, 211 అత్యాచారాలు, 9 గ్యాంగ్ రేప్ కేసుల, 2010 లో 188, 7 గ్యాంగ్ రేప్ లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ లాంటి సంఘటనలు ముంబైలో అరుదుగా నమోదవుతుంటాయని పోలీసులు తెలిపారు. నేరాలను అరికట్టేందుకు తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం అని పోలీసులు అన్నారు.
Advertisement