న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట ఢిల్లీలోని దౌలా కాన్‌లో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ కోరు ఐదుగురు నిందితులను మంగళవారం దోషులుగా నిర్ధారించింది. షంషాద్, ఉస్మాన్, చోటా బిల్లీ, ఇక్బాల్, కమ్రుద్దీన్‌ను అదనపు సెషన్స్ కోర్టు జడ్జి వీరేందర్ భట్ దోషులుగా తేల్చారు. వీరు బాధితురాలిని కిడ్నాప్ చేసి కదులుతున్న వాహనంలో, తర్వాత మరోచోట అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎన్‌ఏ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు.
బాధితురాలి, ఆమె సహోద్యోగుల సాక్ష్యాలు బలంగా ఉన్నాయన్నారు. పరేడ్‌లో ఇద్దరు నిందితులను గుర్తించించిన బాధితు రాలు మిగతా ముగ్గురి అరెస్టుకూ సాయపడిందన్నారు. శిక్ష విధింపుపై విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. 2010 నవంబర్‌లో దౌలా కాన్‌లో ఈశాన్య రాష్ట్రానికి 30 ఏళ్ల కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌ను ఈ ఐదుగురు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు.
దౌలా కాన్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు దోషులుగా నిర్ధారణ
Published Wed, Oct 15 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement
Advertisement