- బయటకు చెబితే చంపుతామని బెదిరింపులు
- ఈ నెల 4న ఘటన 13 రోజుల తర్వాత వెలుగులోకి..
భీమదేవరపల్లి: నానమ్మతో కలసి నిద్రిస్తున్న యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు జరిగిన సంఘటన ఎవరికీ చెప్పుకోలేక 13 రోజులుగా కుమిలిపోరుుంది. విషయం బయటకు పొక్కడంతో గ్రామపెద్దలు సైతం కేసు కాకుండా బేరసారాలు నడిపారు. పోలీసులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హసన్ పర్తి సీఐ రవి కుమార్, ముల్కనూర్ ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన 21 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో , కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పని చేస్తోంది. సదరు యువతి తల్లిదండ్రులు 15 ఏళ్ల క్రితమే మృతి చెందారు.
యువతి అక్కకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. దీంతో ఆమె తన నానమ్మ వద్ద ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిట్టల నరేశ్ కొద్ది రోజులుగా యువతితో స్నేహంగా ఉంటున్నాడు. యువతి నానమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆటోలో ఆమెను అప్పుడప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఈ నెల 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో నరేశ్ యువతికి ఫోన్ చేసి తనకు రూ. 500 కావాలి.. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అతడికి సదరు యువతి డబ్బులివ్వడంతో నరేశ్, అతడి స్నేహితులు బస్వ శ్రీకాంత్, పోలు ప్రేమ్‌కుమార్ మద్యం తాగారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకాంత్ తన సెల్ నుంచి యువతికి ఫోన్ చేశాడు.
అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో నరేశ్, శ్రీకాంత్, ప్రేమ్‌కుమార్‌లు యువతి ఇంటికెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికై నా చెబితే చంపుతామంటూ బెదిరించారు. భయపడి విషయం ఎవరికి చెప్పకుండా యువతి భయంతో గడిపింది. వారం అనంతరం విషయం బయటకు రావడంతో గ్రామ పెద్దలు రాయబేరాలు నడుపుతున్నారు. అయితే, సామూహిక అత్యాచారం జరిగినట్లు సోమవారం రాత్రి పోలీసులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్, శ్రీకాంత్, నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా సదరు యువతిని హోమ్‌కు తరలించారు. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన పెద్దలపై కేసు నమోదు కానున్నట్లు సమాచారం. ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
యువతిపై సామూహిక అత్యాచారం
Published Tue, Oct 18 2016 3:21 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
Advertisement
Advertisement