Imposition of sentence
-
చట్టం చెబుతోంది
సాక్షి నెట్వర్క్ : వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తులపై కేసుల నమోదు.. విచారణ.. శిక్ష విధింపు తదితర అంశాలకు సంబంధించిన విషయాలను భారతీయ శిక్షా స్మృతి (ఇండియున్ పీనల్ కోడ్)లోని వివిధ సెక్షన్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆ సెక్షన్ల ఆధారంగానే న్యాయమూర్తులు తగిన శిక్షలు విధిస్తుంటారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో గల కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఇలా.. నేరం వర్తించే సెక్షన్ అవినీతి సెక్షన్ 24 యూవజ్జీవ శిక్షకు సంబంధించి సెక్షన్ 55 నేరాలకు సాధరణ మినహాయింపు సెక్షన్ 76 శిశు నేరాలు సెక్షన్ 82 ఆత్మ సంరక్షణ సెక్షన్ 96 దుష్ప్రేరణ సెక్షన్ 107 ప్రభుత్వంపై దండెత్తే నేరాలు సెక్షన్ 121 ప్రభుత్వంపై దండెత్తే ఉద్దేశంతో ఆయుధాలు దాచడం సెక్షన్ 122-123 రాజద్రోహం సెక్షన్ 124-126 ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సెక్షన్ 130-140 అక్రమ సమావేశాలు సెక్షన్ 141 నలుగురు వ్యక్తులు గుమిగూడి ఉండటం నిషేధం సెక్షన్ 144 కట్టదగిన నేరాలు సెక్షన్ 143-149 ఎన్నికలకు సంబంధించిన నేరాలు సెక్షన్ 171 (ఏ-ఐ) ఉద్యోగుల శాసన అధికారాలు సెక్షన్ 172-190 సాక్ష్యం కనపడకుండా దాచే నేరాలు సెక్షన్ 201 తప్పుడు సాక్ష్యం చెప్పే నేరాలు సెక్షన్ 191-229 దొంగ నాణేల ముద్రణ సెక్షన్ 231 మోసపూరితమైన తూనికలు,కొలతలకు సంబంధించి సెక్షన్ 264-266 వస్తువుల కల్తీ నేరాలు సెక్షన్ 268-276 జలాశయాలను మలినపరిచే నేరాలు సెక్షన్ 277 నిరక్ష్యపు డ్రైవింగ్ సెక్షన్ 279 అశ్లీల సాహిత్య నేరాలు సెక్షన్ 292 మత సంబంధిత నేరాలు సెక్షన్ 295-298 నరహత్య నేరాలు సెక్షన్ 299 ఉద్దేశపూరకంగా చేసే హత్యా నేరాలు సెక్షన్ 300 యూవజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ హత్య చేస్తే సెక్షన్ 303 వరకట్నం నేరాలు సెక్షన్ 304 హత్యాయత్నం సెక్షన్ 307 అక్రమ నిర్భంధం సెక్షన్ 340 మహిళలపై మానభంగ యత్నం సెక్షన్ 354 మానభంగాలు, విధించే శిక్షలు సెక్షన్ 375-377 చోరీలు సెక్షన్ 378 దోపిడీలు సెక్షన్ 390 బందిపోటుతనం సెక్షన్ 391 మోసం సెక్షన్ 420 అక్రమ ప్రవేశం సెక్షన్ 441 ఫోర్జరీ సెక్షన్ 463 బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్ల అక్రమ ముద్రణ సెక్షన్ 489 వివాహ సంబంధిత నేరాలు సెక్షన్ 493-496 వ్యభిచార నేరం సెక్షన్ 497 అప్రతిష్ట కలుగజేయుట సెక్షన్ 499 ర్యాగింగ్ సెక్షన్ 504 తప్పతాగి బహిరంగ ప్రదేశంలో అల్లరి చేయడం సెక్షన్ 510 -
దౌలా కాన్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు దోషులుగా నిర్ధారణ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట ఢిల్లీలోని దౌలా కాన్‌లో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ కోరు ఐదుగురు నిందితులను మంగళవారం దోషులుగా నిర్ధారించింది. షంషాద్, ఉస్మాన్, చోటా బిల్లీ, ఇక్బాల్, కమ్రుద్దీన్‌ను అదనపు సెషన్స్ కోర్టు జడ్జి వీరేందర్ భట్ దోషులుగా తేల్చారు. వీరు బాధితురాలిని కిడ్నాప్ చేసి కదులుతున్న వాహనంలో, తర్వాత మరోచోట అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎన్ఏ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. బాధితురాలి, ఆమె సహోద్యోగుల సాక్ష్యాలు బలంగా ఉన్నాయన్నారు. పరేడ్‌లో ఇద్దరు నిందితులను గుర్తించించిన బాధితు రాలు మిగతా ముగ్గురి అరెస్టుకూ సాయపడిందన్నారు. శిక్ష విధింపుపై విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. 2010 నవంబర్‌లో దౌలా కాన్‌లో ఈశాన్య రాష్ట్రానికి 30 ఏళ్ల కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌ను ఈ ఐదుగురు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు.