న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ‘నిర్భయ’ తల్లిదండ్రులు బుధవారమిక్కడ కలుసుకున్నారు. మహిళల భద్రత, సంక్షేమం కోసం తాము నడుపుతున్న నిర్భయ జ్యోతి ట్రస్ట్ గురించి వివరించారు. వారి చర్యను అభినందించిన ప్రధాని...మహిళా భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కుమార్తెను కోల్పోయినందుకు నిర్భయ తల్లిదండ్రులను మోదీ ఓదార్చారు. ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై ఆరుగురు కీచకులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేయడం, ఆమె సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూయడం తెలిసిందే.
ప్రధాని మోదీని కలిసిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు
Published Thu, Jan 1 2015 3:02 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement