అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసి.. | West Bengal: Woman raped, thrown out of moving auto in unconscious state | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసి..

Published Mon, Aug 4 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసి..

అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసి..

పశ్చిమ బెంగాల్‌లో ఘాతుకం

మహేస్తలా(పశ్చిమబెంగాల్): ఓ వివాహితపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడడమేగాక.. అపస్మారక స్థితిలో ఆమెను ఆటోలో నుంచి తోసివేసిన ఘటన పశ్చిమబెంగాల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా శివార్లలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అక్రాలో ఈ దారుణం గత నెల 31వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. 24 ఏళ్ల వివాహిత భర్త నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలసి అక్రాలో తల్లి వద్ద ఉంటోంది. ఆమెకు షఫీక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. షఫీక్ గత నెల 31న సాయంత్రం ఆమెను పిలిపించుకుని నంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు.

అతని వెంట మరో నలుగురున్నారు. ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి మత్తులోకి వెళ్లిన తరువాత ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అక్రా వద్ద ఆటోలో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. చికిత్సకోసం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు రాత్రి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేసినట్టు జిల్లా ఏఎస్పీ రవీంద్రనాథ్ అభారు తెలిపారు. ప్రధాన నిందితుడు షఫీక్ కోసం గాలిస్తున్నామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement