కోర్టును ఆశ్రయించిన సామూహిక అత్యాచార బాధితురాలు
అహ్మదాబాద్: సామూహిక అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఓ మహిళ, తన గర్భాన్ని తొలగించుకోవటానికి అనుమతించాల్సిందిగా అహ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తాను శిశువుకు జన్మనిచ్చినట్లయితే.. తన భర్త తనను స్వీకరించడని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మార్చి 16న రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం 2014లో సదరు మహిళను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దాదాపు 8 నెలల పాటు వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆమె 26వారాల గర్భవతి. ముందుగా కిందికోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 26న కొట్టివేశారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
అబార్షన్‌కు అనుమతివ్వండి
Published Tue, Apr 7 2015 1:20 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
Advertisement