కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య | PG student committs suicide due to lack of money for Bank coaching | Sakshi
Sakshi News home page

కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Mar 5 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య

కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య

లేపాక్షి: బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి తండ్రి కథనం ప్రకారం... రామచంద్రప్ప కుమారుడు రఘువర్దన్(23) ఎంకామ్ చ దివాడు. బ్యాంకు ఉద్యోగం కోసం మూడు సార్లు పరీక్షలు రాశారు. కోచింగ్ లేకపోవడం వల్లే ఉద్యోగం రావడంలేదని ఇంట్లో చెప్పేవాడు. పేద కుటుంబం కావడం, ఇటీవల తల్లి చనిపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కర్నూలులో బ్యాంకు పరీక్ష రాసి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement