గాంధీఆస్పత్రి: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన సప్లమెంటరీ పరీక్షలు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం జరగలేదని, మరోమారు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలు మెడికల్ కాలేజీలకు చెందిన ఎంబీబీఎస్ ఫస్టియర్ వైద్యవిద్యార్థులు సికింద్రాబాద్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
పరీక్షపత్రంలో లోపాలు ఉన్నాయని, సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడంతో రాష్ట్రంలో పది శాతం అంటే 530 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రీకరెక్షన్ లేదా మరోమారు పరీక్ష నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment