ముంబై: ‘లాక్‌డౌన్‌లో నేను ఉన్న ప్రాంతం(అలీబాగ్) తొలుత రెడ్‌జోన్‌లో ఉండేది. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోగానే వెంటనే బీర్ తెచ్చుకుంటాను. చాలా మద్యం షాపుల దగ్గర భౌతిక దూరం పాటించడం లేదు. నేను మాత్రం తప్పకుండా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించే షాప్‌కు వెళ్లి మద్యం తెచ్చుకుంటాను. ఇక నేను ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం ఉంటే కచ్చితంగా రోజర్ బిన్నీ, లక్షణ్ శివరామకృష్ణన్‌లతో కలిసి తాగుతాను’అని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇక ఆస్ట్రేలియా వేదికగా 1985లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రవిశాస్త్రి హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా తనను మియాందాద్ స్లెడ్జింగ్ చేశాడని తెలిపాడు. ‘పాకిస్థాన్‌ని ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయతీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ(ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ) కారు గెలుచుకునే అవకాశం దక్కలేదు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
చదవండి:
‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’
'అందుకే రైనాను పక్కన పెట్టాం'
Comments
Please login to add a commentAdd a comment