
సాక్షి,సిద్దిపేటజిల్లా: గజ్వేల్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి శుక్రవారం(సెప్టెంబర్6)10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభించారు. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనున్నారని సమాచారం.
రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల కవిత ఐదు నెలలు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉండి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment