
Allu Arjun And Sneha Reddys Diwali Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె దీపావళి వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫాంహౌస్‌లో జరిగిన ఈ దీపావళి వేడుకల్లో రామ్‌చరణ్, ఉపాసనలతో పాటు మిగతా మెగా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ..
'ఫాంహౌస్‌లో మా దీపావళి పార్టీ. డెకరేషన్ అంతా స్వయంగా స్నేహ దగ్గరుండి చేయించింది..దీపావళి వైబ్స్' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అల్లుఅర్జున్, స్నేహరెడ్డి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో సందడి చేశారు. ముఖ్యంగా స్నేహ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని సౌందర్యం అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి
చదవండి: ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా!