
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన అనంతరం.. అటు నుంచే అటే ఎర్రవెల్లికి బయల్దేరారు.
ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసి ఎన్నికల ఫలితాలపై వాళ్లు చర్చించనున్నారు. అలాగే.. పార్టీ కార్యాచరణ గురించి వాళ్లు చర్చించనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు కూడా వాళ్ల వెంట ఫామ్‌హౌజ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment