ఎవరెస్టు ఎక్కిన ఫొటోలను కేటీఆర్‌కు చూపుతున్న తిరుపతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తిరుపతిరెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా నవాబు పేట ఎల్లకొండకు చెందిన తిరుపతిరెడ్డి ఇటీవలే ఎవరెస్టును అధిరోహించారు. టీఆర్‌ఎస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.నందు సహకారంతో ఆయన మంగళవారమిక్కడ కేటీఆర్‌ను కలిశారు. స్థానికులు కొందరు రూ.3లక్షలిచ్చి ప్రోత్సహించారని, శంకర్‌పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగం రూ.11.5 లక్షలు, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ కొంత ఆర్థిక సహాయం చేయడంతో తాను ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు తిరుపతి తెలిపారు.
వికలాంగుడికి వాహనం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వికలాంగు డు సంబరబోయిన శివ(20) ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణంలో ఇబ్బంది పడేవారు. దీంతో తనకు ఒక వాహనాన్ని ఇప్పించాలని కోరుతూ ఆయ న కేటీఆర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. శివకు వాహనం ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఒక హోండా యాక్టివాను కొనుగోలు చేశారు. మంగళవారం కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమక్షంలో శివకు యాక్టివాను అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఆదిలాబాద్, నిర్మల్ జెడ్పీ చైర్‌పర్సన్లు రాథోడ్ జనార్దన్, కె.విజయలక్ష్మిలు కేటీఆర్‌ను కలిశా రు. ఈ సందర్భంగా సమన్వయంతో జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, పలువురు జెడ్పీటీసీలు కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment