అడ్వాన్స్ కార్డు ఉన్నవారికి నెలలో ఒక రోజు ఉచితంగా పాలు
హైదరాబాద్: జూన్ 1న ఇంటర్నేషనల్ మిల్క్ డే, జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని విజయ పాల వినియోగదారులకు, విక్రయదారులకు జూన్ నుంచి ప్రతి నెలలో ఒక రోజు ఉచితంగా పాలు సరఫరా చేసే పథకానికి విజయ డెయిరీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటీవ్ ఫెడరేషన్ లిమిటెడ్ మిల్క్ ప్రొడక్టు ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తిరుపతి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయ పాల అడ్వాన్స్ కార్డు కొనుగోలు దారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. నెలలో 31 రోజులు ఉన్నా అడ్వాన్స్ కార్డు మీద కేవలం 30 రోజులకే, 30 రోజులు ఉన్నా కేవలం 29 రోజులకే బిల్లు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్డులను మొదటి విడతగా ప్రతి నెల 1 నుంచి 9 వ తేదీ వరకు.. రెండవ విడత 11 నుంచి 12 వ తేదీ వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు.
వినియోగదారులకు ‘విజయ’ కానుక
Published Sun, May 31 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement