హైదరాబాద్: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు.
రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు.
తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
Comments
Please login to add a commentAdd a comment